తెలుగులోకి ఒప్పమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొంది సంచలన విజయం సాధించిన ‘ఒప్పమ్’ చిత్రం త్వరలోనే తెలుగులోకి రీమేక్ కానుంది. మలయాళంలో కేవలం మూడు వారాల్లో 27 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించిన ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు హక్కులను ఓవర్సీస్ నెట్‌వర్క్ సంస్థ స్వంతం చేసుకుంది. మోహన్‌లాల్ అంధుడిగా నటించిన ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా హక్కుల కోసం భారీ పోటీ ఏర్పడింది. ఈ కోవలో అత్యధిక పారితోషికానికి తెలుగు హక్కులను స్వంతం చేసుకున్నారు. ప్రస్తుతం మనమంతా, జనతాగ్యారేజ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకుదగ్గరైన మోహన్‌లాల్, మరి తెలుగు రీమేక్‌లో కూడా నటిస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. అయితే ఈ చిత్రంలో హీరోగా ఎవరు నటిస్తారన్నది తెలియాల్సి వుంది.