సుమంత్‌కు జోడీ దొరికింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని కుటుంబం నుంచి హీరోగా పరిచయమై పలు చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ వరుస పరాజయాలు అవడంతో అవకాశాలు తగ్గాయి. దాంతో కాస్త బ్రేక్ తీసుకుని ఎన్నో ఆశలతో చేసిన ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సినిమా కూడా అనుకున్న స్థాయి విజయాన్ని ఇవ్వలేకపోయింది. దాంతో, కొంత గ్యాప్ తర్వాత మళ్లీ హీరోగా రీఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్‌లో సూపర్‌హిట్ అయిన విక్కీ డోనార్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మల్లిక్‌రామ్ దర్శకుడిగా తెరకెక్కించే ఈ చిత్రాన్ని సుమంత్ నిర్మిస్తాడని తెలిసింది. సుమంత్‌కు జోడీగా హిందీ టీవీ సీరియల్స్‌లో పాపులరైన పల్లవి సుభాష్‌ను హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి రానుంది.