మరో తమిళ దర్శకుడికి చాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం చెన్నైలో జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రముఖ తమిళ దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ముంబైలో షూటింగ్‌కు షిప్ట్ కానుంది. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌పై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. తాజాగా ‘అభిమన్యుడు’ అనే టైటిల్ పెడుతున్నట్లు కోలీవుడ్‌లో జోరుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఇక ఈ సినిమా తరువాత మహేష్ మళ్లీ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. నవంబర్ లేదా డిసెంబర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది. డి.వి.వి.దానయ్య నిర్మించే ఈ సినిమా తరువాత మహేష్ మళ్లీ ఓ తమిళ దర్శకుడితో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే, రాజారాణి, పోలీస్ చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకు అట్లీ దగ్గర సహాయకుడిగా పనిచేసిన బాస్కో దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుందట. రజనీతో కబాలి చిత్రాన్ని నిర్మించిన కలైపులి థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తాడని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే మహేష్‌తో థాను చర్చలు జరుపుతున్నట్టు, ఇప్పటికే కథా చర్చలు కూడా జరుగుతున్నట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.