పడమటి తీరంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిషకు ఈ ఏడాది కీలకంగా మరిందని చెప్పాలి. ఈ ఏడాది వరుస సినిమాలతో జోరుగానే కెరీర్ సాగినా పెళ్లి విషయంలో మాత్రం తేడాలు వచ్చాయి. ఏదేమైనా నిరాశపడకుండా కేవలం కెరీర్‌పైన దృష్టి సారించి వరుసగా సినిమాలు చేస్తున్న ఈ భామ తెలుగు, తమిళ భాషల్లో అరడజనకుపైగా చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతోంది.
అయితే వచ్చే ఏడాది ఇంకా జోరుగా వుండాలని ఇప్పటికే విదేశాలకు చెక్కేసింది. ఇప్పటికే అమెరికాలో క్రిస్మస్ సంబరాల్ని జోరుగా చేసుకున్న ఈ భామ, వేగాస్ సిటీలో తన ఫ్రెండ్స్‌తో కలిసి బాగా ఎంజాయ్ చేసిందట. అలాగే, డిసెంబర్ 31 సంబరాలు కూడా శాన్‌ఫ్రాన్సిస్‌కోలో చేసుకుంటుందట. ఈ ఏడాది సినిమాలు చేస్తూ బాగా అలిసిపోయాను కాబట్టి రిలాక్స్ కోసం ఇలా వచ్చానని చెబుతోందట. ఏదేమైనా రిఫ్రెష్‌మెంట్‌తో మళ్లీ వచ్చే ఏడాది జోరుగా సినిమాలు చేయడానికి రెడీ అవుతోంది. నిజంగా త్రిష ప్లాన్ భలేగుంది!