ధోనీ వాళ్లకు వద్దట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీమిండియా కెప్టెన్ జీవితకథ ఆధారంగా నిర్మించిన ‘ఎం.ఎస్.్ధని-ద అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమాను పాకిస్తాన్‌లో ప్రదర్శించడం లేదు. కాశ్మీర్‌లోని ఉరీ సైనికశిబిరంపై ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడి అనంతరం ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో ఆ సినిమాను ప్రదర్శించడం లేదని ప్రఖ్యాత సినీడిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఐఎంజిఎల్ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ తెలిపింది. సుశాంత్‌సింగ్ రాజ్‌పుట్ ధోనీగా నటిస్తుండగా నీరజ్‌పాండే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈనెల 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావలసి ఉంది. కాగా ఉరీ దాడి అనంతరం దేశంలో ఉన్న పాకిస్తాన్ కళాకారులు, సినీనటులు భారత్‌నుంచి 48 గంటల్లోగా వెళ్లిపోవాలని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అల్టిమేటమ్ ఇచ్చిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య మాటలదాడులు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో ధోని చిత్రాన్ని ప్రదర్శించడం సాధ్యంకాదని పాకిస్తాన్ సినీవర్గాలు వెల్లడించాయి. కాగా లాహోర్‌కు చెందిన ఓ న్యాయవాది భారతీయ సినిమాలను ప్రదర్శించరాదని ఆదేశించాలంటూ ఈనెల 23న హైకోర్టులో ఓ పిల్ దాఖలు చేశారు.