ఎవరికి అనుచరుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమెడియన్‌నుంచి హీరోగా టర్న్ అయిన సునీల్ ఈమధ్య వరుస పరాజయాల తరువాత కాస్త గ్యాప్ తీసుకుని ఆచి తూచి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ‘కృష్ణాష్టమి’ చిత్రంలో నటిస్తున్న సునీల్, దాంతోపాటు వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ భామ మన్నారాచోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. ఈ చిత్రానికి ‘అనుచరుడు’ అనే టైటిల్‌ను పెడుతున్నట్టు తెలిసింది. ఇదివరకే ఈ సినిమా కోసం రకరకాల టైటిల్స్ వినిపించాయి. ఈమధ్యే ‘జక్కన్న’ అనే పేరు కూడా పెడతారని వార్తలొచ్చాయి. చివరగా కథకు అనుగుణంగా ఉండడంతో ‘అనుచరుడు’ అనే టైటిల్‌ను ఓకె చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.