అమరుల త్యాగాల వీణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమన్, శివకృష్ణ, ప్రీతినిగమ్ ప్రధాన తారాగణంగా ప్రేమ్ మూవీస్ పతాకంపై మిరియాల రవికుమార్ దర్శకత్వంలో కొత్తపల్లి సతీష్‌బాబు రూపొందించిన చిత్రం ‘త్యాగాల వీణ’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సి.ఎమ్ క్యాంప్ ఆఫీసులో విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరిగిన తీరును, ఉద్యమకారుల త్యాగాలను భవిష్యత్ తరాలకు అందించాలనే లక్ష్యంతో ‘త్యాగాల వీణ’ చిత్రాన్ని రూపొందించిన దర్శక నిర్మాతలను అభినందిస్తున్నాన్నారు. ఈ సినిమాలో రమేష్ ముక్కెర అందించిన సంగీతం తనకు నచ్చిందన్నారు. త్యాగాలవీణ చిత్ర ఉత్సాహంతోనే భవిష్యత్తులో మంచి చిత్రాలను తీయడానికి కృషిచేస్తానని, ఈ సినిమాలో రమేష్ ముక్కెర సంగీతం, జానపద కళాకారులు బొమ్మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి కొరియోగ్రఫి హైలెట్‌గా నిలుస్తాయని దర్శకుడు మిరియాల రవికుమార్ అన్నారు. కార్యక్రమంలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, ఈద శంకర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, రాయల భిక్షం తదితరులు పాల్గొన్నారు. సుమశ్రీ, రాజీ, మధుబాల, ఇంద్ర, రాజీవ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:డి.యాదగిరి, ఎడిటింగ్:గడ్డం సంతోష్, నిర్మాత:కొత్తపల్లి సతీష్‌బాబు, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: మిరియాల రవికుమార్.