ఎహే...నా ఊతపదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఈడు గోల్డ్ ఎహే’ చిత్రానికి దర్శకుడే కర్త కర్మ క్రియలా నిలిచారు. అన్ని సినిమాల్లో మాదిరిగానే ఈ సినిమాలో నటించా. కానీ వీరూ పోట్ల నాలోని కొత్త నటుణ్ణి బయటికి తీశాడు అని నటుడు సునీల్ తెలిపారు. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వీరూపోట్ల దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం రూపొందించిన చిత్రం ‘ఈడు గోల్డ్ ఏహే’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 7న విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా హీరో సునీల్ చిత్ర విశేషాలను పాత్రికేయులతో ముచ్చటించారు.

సస్పెన్స్ థ్రిల్‌తో
ఈ చిత్రం నా కెరీర్‌లోనే ఓ స్పెషల్ చిత్రం. నా సినిమాల్లోకెల్లా ‘మర్యాదరామన్న’ ఓ వైవిధ్య చిత్రం. అలాగే ఈ చిత్రం కూడా నిలుస్తుంది. ఈ సినిమాలో ప్రేక్షకులు ఊహించని విషయాలు వస్తాయి. సస్పెన్స్ థ్రిల్‌తో సాగుతుంది. చివరి సన్నివేశం వరకూ నేను ఎదుర్కొంటున్న కష్టాన్ని దాటుతానా లేదా అన్న టెన్షన్‌తోనే ప్రేక్షకులు సినిమా చూస్తారు. ఏ ఫ్రేములోనూ కామెడీ మిస్ కాకుండా ప్రతి ఫ్రేమ్‌లోనూ కామెడీ ఉండేలా దర్శకుడు డిజైన్ చేశాడు.
ఆయ్.. బంగార్రాజండీ!
ఈ చిత్రంలో నా పేరు బంగార్రాజు. సినిమా ప్రారంభానికిముందు వీరూపోట్ల నవ్వే ఫొటో ఒకటి సీరియస్‌గా వున్న ఫొటో ఒకటి నన్ను పంపమన్నాడు. అలా పంపిస్తే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ తయారుచేసి పంపుతా అన్నాడు. నేను అలాగే పంపించాను. ఆ రెండు ఫొటోలతో ఈడు గోల్డ్ ఏహే పోస్టర్‌ను తయారుచేసి పంపించాడు. సహజంగా నేనెవరితోనైనా ఎహే అనే మాట్లాడతా. అది నా శ్లాంగ్. ఈ చిత్రం పేరు చెప్పాలంటే టై కట్టుకున్నవాడైనా సరే ఏహే అనాల్సిందే. అది నాకు నవ్వు తెప్పిస్తోంది.
చాలామంది హాస్యనటులు
ఈ సినిమాలో కమెడియన్స్, కారెక్టర్ ఆరిస్టులు అనేకమంది నటించారు. ఎన్నో కేరెక్టర్లు వుంటాయి. దర్శకుడి సెన్సాఫ్ హ్యూమర్‌కి ఉదాహరణగా పబ్ పేరు కూడా డాడ్ డాష్ అని పెట్టాడు. తండ్రి డబ్బుతో మందుకొట్టే కొడుకులు వచ్చే బార్ అని అర్థం. బ్యాక్‌గ్రౌండ్ టైటిల్స్‌లోనూ అలా కామెడీ చూపాడు.
రెండు షేడ్స్‌తో
ఈ చిత్రంలో రెండు షేడ్స్ వున్న పాత్రలో నటించాను. నా కెరీర్‌లో ఇలాంటి పాత్ర మళ్లీ ఉండకపోవచ్చేమో. ఆ రెండు పాత్రలు ఏంటి అని చెప్పేస్తే క్లైమాక్స్‌ను మీరు ఎంజాయ్ చేయలేరు. అందుకే చెప్పటంలేదు. నన్ను నేను కాపాడుకోవడం కోసం ననె్నవరూ గుర్తుపట్టకుండా మాస్క్ వేసుకుని తిరుగుతా.
నన్ను దృష్టిలో పెట్టుకునే
దర్శకుడు వీరూపోట్ల, నేను చాలాకాలంగా స్నేహితులం. నన్ను దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాశాడాయన. స్క్రిప్ట్‌లో దమ్ముంది కనుక, నేను కాకపోయినా ఈ చిత్రం మరొకరు హీరోగా నటించినా నచ్చుతుంది. కానీ నా మ్యానరిజానికి సరిపోతుంది కనుక నేను నటించాను.
కమర్షియల్స్ అచ్చిరావు
కమర్షియల్ సినిమాలు చేయడం చాలా కష్టమైన పని. వాటిల్లో హీరోగా అందరూ నటించలేరు. అదే ఫార్మాట్‌లో అంటే, కమర్షియల్ ఫార్మాట్‌లోనే ప్రేక్షకుల్ని నవ్వించగలగాలి. అతి కత్తిమీద సాములాంటిది. మనం చేయగలమూ అన్నట్లే వుంటుంది కానీ చేయలేం. కమర్షియల్ సినిమా ఐటెం లాంటిది. దాన్ని సరైన విధంగా ప్రేక్షకులకు అందించడం చాలా కష్టమైన పని. ఒక సినిమాలో కథ బాగుందనుకోండి, ఆ కథే హిట్ ఇస్తుంది. ఏమీ లేనపుడు ఆర్టిస్టు నటనే కొత్తగా వుండాలి. డిఫరెంట్ సినిమాగా దాన్ని తయారుచేయాలంటే నటుడి దమ్ము బైటపడుతుంది అని నేను నమ్ముతా.
విలన్ అవుదామని
నేను సినిమా పరిశ్రమకు వచ్చిందే విలన్‌గా నటించాలని. శ్రీదేవిని, కోట శ్రీనివాసరావుని కలిపితే ఎలా వుంటుందో నా పద్ధతి అలా వుంటుంది. శ్రీదేవి ఇన్నోసెన్స్ గర్ల్‌గా ఏ చిత్రంలో అయినా కనిపిస్తుంది. అలాగే కోట శ్రీనివాసరావులోని కామెడీ పంచ్ నాలోనూ వుంది. ఆయనే నాకు ఇన్‌స్పిరేషన్.
అందుకే సిక్స్ ప్యాక్
తొలుత రామ్‌గోపాల్‌వర్మ దగ్గరకు వెళ్లి విలన్‌గా చేస్తానన్నా. హీరోనే చంపేసేలా వున్నావయ్యా అన్నారు. ఆ తరువాత కమెడియన్‌గా చేసి హీరోగా మారాలి అనుకున్నపుడు విలన్‌ని నేను కొడితే ప్రేక్షకులు ఒప్పుకోవాలి కదా. అందుకే సంకల్పంతో సిక్స్ ప్యాక్ చేశాను. దేవుడు నేను అనుకున్న విధంగా ఫలితాన్నిచ్చాడు.
క్రాంతిమాధవ్‌తో
ఈ సినిమా తరువాత క్రాంతిమాధవ్‌తో ఓ చిత్రం చేస్తున్నా. ఇది పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. 30 శాతం పూర్తయింది. క్రాంతిమాధవ్ దర్శకుడు కనుక ఓ మెంచి మెసేజ్ కూడా వుంటుంది.

-యు