ప్రయోగాల హోరు... కథకు జోహారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా అంటే ఎప్పుడూ ఫక్తు కమర్షియల్ ఫార్మెట్‌లో సినిమాలు చేస్తారు. కొత్తదనం జాడ కనిపించదనే అపవాదు ఉంది. అయితే ఇప్పుడు ఆ అపవాదును దూరం చేసే ప్రయత్నాలు ఈ ఏడాదిలో బాగా జరిగాయి. తెలుగు సినిమాలో ప్రయోగాలే కాదు కమర్షియల్ ఫార్ములాలో సంచలన చిత్రాలు తీయగలరంటూ నిరూపించారు. మొత్తానికి గడచిన ఈ ఏడాది తెలుగు సినిమా చరిత్రలో కాస్త కీలకమైన ఏడాదిగా పరిగణించాలి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది ‘బాహుబలి’ సినిమా గురించి. దాదాపు రెండేళ్ళ శ్రమతో తెరకెక్కిన ఈ సినిమా విడుదలై, అంచనాలకుమించి విజయాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాల వ్యాప్తం చేసి బాక్సాఫీస్‌ను కొల్లగొట్టింది. ఓ కల్పిత కథను అద్భుత రీతిలో తెరకెక్కించి బాలీవుడ్ సినిమాల స్థాయిని మించిపోయేలా చేసిన సినిమా ‘బాహుబలి’. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాతో ఆయన క్రేజ్ దేశ వ్యాప్తం అయింది. దర్శక ధీరుడు రాజవౌళి తెరకెక్కించిన ఈ సినిమాతో తెలుగు సినిమాకు మరింత గుర్తింపు లభించింది. దాంతోపాటు ఇతర భాషల్లో తెలుగు సినిమాకు మంచి మార్కెట్ ఏర్పడింది. ఆ స్ఫూర్తితో తెరకెక్కిన మరో చారిత్రాత్మక చిత్రం ‘రుద్రమదేవి’. అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చారిత్రక చిత్రం తెలుగు సినిమాలో ఎలాంటి ప్రయోగం అయినా చేయాలనిపించే రీతిలో తెరకెక్కించాడు దర్శకుడు గుణశేఖర్. భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో మాత్రం విజయం సాధించలేకపోయింది. ఇక ఈ ఏడాది మరో ప్రయోగంతో సోషల్ మెసేజ్‌తో తెరకెక్కిన చిత్రం ‘శ్రీమంతుడు’. మనం బాగుపడడమే కాకుండా మన సొంత గ్రామాలను సైతం బాగుపరచాలనే అంశంతో తెరకెక్కిన ఈ సినిమాతో మహేష్ అందరినీ ఆకట్టుకున్నాడు. ఆకట్టుకోవడమే కాకుండా అది చేతల్లో కూడా చేసి చూపి చాలామందికి ఆదర్శంగా నిలిచాడు. సొంత గ్రామాలను దత్తత తీసుకోమని సందేశం ఇచ్చే ఈ సినిమా చూసి చాలామంది ఇన్స్‌ఫైర్ అయి చాలా గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఈ సినిమాతో తెలుగు సినిమా బాక్సాఫీసు వంద కోట్ల మార్కెట్‌ను క్రాస్ చేసింది. ఈ ఏడాది ఈ మార్క్ సాధించి మొదటి స్థానంలో నిలిచాడు మహేష్. ఇక ఈ ఏడాది ప్రయోగాత్మక చిత్రాలు భారీ స్థాయిలో తెరకెక్కాయి. ముఖ్యంగా ఈ ఏడాది హారర్ సినిమాల హవా జోరుగా సాగింది. వాటికి ప్రేక్షకాదరణ కూడా బాగా ఉండడంతో డజన్లకొద్ది చిత్రాలు రూపొందాయి.
ఈ ఏడాది ప్రథమార్థంలో మనిషికి దేవుడికి మధ్య వుండే సంబంధం అనే అంశంతో తెరకెక్కిన ‘గోపాల గోపాల’ సినిమా సెటైరికల్ కామెడీగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా దేవుడు ఎక్కడో లేడు, సాటి మనిషిలోనే ఉన్నాడు అన్న అంశాన్ని ఆకట్టుకునేలా చెప్పారు. హిందీలో సూపర్‌హిట్ అయిన ‘ఓ మై గాడ్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో వెంకటేష్, పవన్‌కళ్యాణ్ నటించారు. ఇక సినిమాల్లో హీరోని హీరోలా కాకుండా విలన్‌లా చూపిస్తూ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘టెంపర్’ సినిమాను ప్రేక్షకులు ఓకే చెప్పేశారు. విభిన్నమైన అంశంతో తెరకెక్కిన ఈ సినిమా కూడా ఓ ప్రయోగమనే చెప్పాలి. ఇక తెలుగు సినిమాలో హీరో అంటే అన్ని రకాలుగా ఫిట్‌గా ఉంటాడనే విషయం ఇప్పటికే కొన్ని వందల సినిమాల్లో చూసేసాం. కాని హీరోకు ఓ అనారోగ్యం.. లేదా ఓ డిసీజ్ ఉంటే ఎలా ఉంటుంది అనే కథతో యువ హీరో నిఖిల్ ‘సూర్య వర్సెస్ సూర్య’ సినిమాతో సరికొత్త ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగం ఫర్వాలేదనిపించుకుంది. ఇంకా విభిన్న కథాంశంతో తెరకెక్కిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో నాని ఓకె అనిపించుకున్నాడు. కమర్షియల్‌గా ఎలా వున్నా సినిమా మాత్రం సాధారణ ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. ఇక మరో విభిన్న అంశంతో ఆత్మలే మనిషికి కనిపిస్తే అనే అంశంతో తెరకెక్కిన సినిమా ‘వారధి’. కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమా ఫర్వాలేదన్పించుకున్నా అందులోని మిగిలిన అంశాలు ప్రేక్షకుడిని సంతృప్తి పరచలేకపోవడంతో ఆ సినిమా కమర్షియల్‌గా ఆకట్టుకోలేకపోయింది. ఇక బాలీవుడ్‌లో వేశ్య కథలతో చాలా సినిమాలే వచ్చాయి. కాని తెలుగులో అలాంటి కోణంలో సినిమాలు రావడం చాలా అరుదు. ఈసారి అలాంటి ప్రయత్నాన్ని చేసాడు దర్శకుడు పూరి జగన్నాధ్. ఛార్మి వేశ్య పాత్రలో నటించిన ‘జ్యోతిలక్ష్మి’ కూడా ఓ ప్రయోగమే అయినా ఆ సినిమాను మాత్రం తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. ఛార్మికి నటిగా మంచి పేరు దక్కినా కమర్షియల్‌గా మాత్రం ఆకట్టుకోలేకపోయింది.
ఇక మరోసారి హీరోకు ఓ విలక్షణ వ్యాధి వుంటే ఎలా వుంటుందనే కథాంశం ‘్భలే భలే మగాడివోయ్’తో నాని చేసిన ప్రయత్నం ఈసారి కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని అందుకుంది. మతిమరుపు పాత్రలో నాని నటన ఆకట్టుకుంది. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మారుతిని పెద్ద కమర్షియల్ దర్శకుణ్ణి చేసింది. ఇక విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా క్రిష్ ఈసారి రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంతో మెగా హీరో వరుణ్‌తో కలిసి వేసిన ‘కంచె’ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అయితే కమర్షియల్‌గా మాత్రం డీలాపడింది. ఇక క్రేజీ హీరోయిన్ అనుష్క మరోసారి విభిన్నమైన పాత్రలో నటించిన చిత్రం ‘సైజ్ జీరో’. భారీకాయంతో ఉన్న అమ్మాయి జీవితంలో పెళ్లి జరిగిందా లేదా అనే అంశంతో తెరకెక్కిన ఈ సినిమా పెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇక హీరోయిన్ నిజ జీవితంలో ఫాస్ట్‌గా వుంటే ఎలా వుంటుందనే కథాంశంతో తెరకెక్కిన ‘కుమారి 21 ఎఫ్’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. క్రేజీ దర్శకుడు సుకుమార్ కథతో తెరకెక్కిన ఈ సినిమా మంచి వసూళ్లు దక్కించుకుంది. ‘ఉయ్యాల జంపాల’, ‘సినిమా చూపిస్తా మావా’ సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న రాజ్‌తరుణ్‌కు హ్యాట్రిక్ హిట్ దక్కింది. ఇటీవలే సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘్భలే మంచిరోజు’ సినిమా కూడా ఓ ప్రయోగమనే చెప్పాలి. విభిన్న కథతో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంటుంది. మొత్తానికి ఈ ఏడాది తెలుగులో విభిన్న ప్రయోగాలతో ప్రేక్షకులను అలరించేందుకు కొత్త సినిమాలు ఎక్కువగానే వచ్చాయి. తెలుగు సినిమా కూడా మూస సినిమాలకు భిన్నంగా ప్రయాణం సాగిస్తుంది అని చెప్పడం విశేషం ఏమీ కాదు? ఇక వచ్చే ఏడాది మరిన్ని ప్రయోగాత్మక చిత్రాలు రావాలని కోరుకుందాం.

- శ్రీ