కథకే ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రేమమ్’ చిత్రం కథ ఒక్కటే అయినా మూడు వేరియేషన్స్‌లో కథానాయకుడి పాత్ర ఉంటుంది. కొత్తగా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఆ మూడు పాత్రల్లో ఇప్పటివరకూ నా జీవితంలో జరిగిన దానినే గుర్తుచేసుకుంటూ నటించాను. అయితే టీచర్‌ను ప్రేమించే పాత్ర ఇంతవరకూ చేయలేదు. అది మాత్రం దర్శకుడు చెప్పినట్టు
చేసుకెళ్లాను. ప్రేక్షకుల దృష్టిలో చైతన్య ఇలాంటి పాత్రలు చేయగలడు అన్న నమ్మకం రావడం కోసమే ప్రయత్నించాను’ అని నటుడు నాగచైతన్య తెలిపారు. శ్రుతిహాసన్, మడొన్నా సెబాస్టియన్, అనుపమా పరమేశ్వరన్ కథానాయికలుగా నాగచైతన్య హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చందూ మొండేటి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ రూపొందిస్తున్న ‘ప్రేమమ్’ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని 7న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా
నాగచైతన్య పలు విశేషాలను తెలిపారు.

బెటర్‌గా చేయాలని
మలయాళంలో ‘ప్రేమమ్’ స్లో పాయిజన్‌లా పెద్ద హిట్టే అయింది. దాన్ని రీమేక్ చేయాలనుకున్నపుడు ఎలా చేయాలా అన్న ఇబ్బంది ఎదురైంది. అయితే, కాపీ కొట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇలాంటి క్లాసికల్ సినిమాలు వాళ్లకంటే మనమే బెటర్‌గా చేయాలని మాత్రం అనుకున్నాం. వాళ్లు చేసిన తప్పులను మనం చేయకూడదనుకున్నాం. సినిమా సోల్ నచ్చడంతో తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని, మన నేటివిటీకి చాలా మార్పులు చేశాం.
చందుకు కమర్షియల్ బెస్ట్
దర్శకుడు చందూ మొండేటి వర్కింగ్ స్టైల్ నాకు నచ్చుతుంది. అందుకే ఓ కమర్షియల్ స్టైల్లో కాకుండా వైవిధ్యంగా చేయాలన్న అతని ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ చిత్రం చేశాం. ఒకరకంగా ఈ చిత్రాన్ని డైరెక్టు చేయమని నేనే అతన్ని అడిగా. అయితే చందూ మొండేటి లాంటి దర్ళకుడితో రీమేక్‌కన్నా స్ట్రెయిట్ చిత్రమే బావుంటుంది. అతని ఆలోచనా విధానం స్ట్రెయిట్ చిత్రాలకు వందశాతం సూట్ అవుతుంది.
రీమేక్స్ కొత్తకాదు
రీమేక్ సినిమాలు చేయడం అనేది మనకు కొత్త విషయమేమీ కాదు. మన తెలుగు సినిమాలు అనేక భాషల్లో రీమేక్ చేశారు. ఈ సినిమా విషయంలో అనవసరమైన కామెంట్స్ ఎందుకొస్తున్నాయో అర్థం కాలేదు. మలయాళం సినిమాకన్నా బాగా తీయాలని అక్కడా చెప్పాం.
కథే ప్రధానం
నాకు చిన్నా పెద్దా దర్శకులనే తేడా ఎప్పుడూ లేదు. ఏదైనా కథే ప్రధానంగా వుండాలని కోరుకుంటాను. కొత్త ఆలోచనలతో వుండే దర్శకులను ప్రోత్సహించాలి. స్టార్ కంటే మంచి నటుడు అంటేనే నేను కంఫర్ట్‌గా వుంటా. ఈరోజు చందు మొండేటి చిన్న దర్శకుడు అంటున్నారు. ఈ సినిమా హిట్ అయితే పెద్ద దర్శకుడంటారు. అంతే తేడా!
చాలా ప్రేరణ చెందా
మలయాళంలో మాతృక సినిమా చూశాక హీరో నటనకు ఆశ్చర్యపడ్డాను. ముఖ్యంగా నవీన్ పౌలి రెండో ప్రేమకథలో చేసిన నటన చూసి చాలా నేర్చుకోవాలి. దాన్ని అలాగే ఈ సినిమాలో కూడా చేయడానికి ప్రయత్నించా. మిగతా రెండు వేరియేషన్స్ వున్న కథలను నా స్టైల్లో చేశాను.
కొంచెం స్పీడుగా
మలయాళ ప్రేక్షకులు పొయిటిక్ నేరేషన్‌ను ఇష్టపడతారు. తెలుగు ప్రేక్షకులకు ఫాస్ట్‌గా వుండాలి. కనుక ఈ రెండింటిని బేస్ చేసుకుని స్టోరీ ఎక్కడా ఛేంజ్ చేయకుండా నేరేషన్ పరంగా ఉండే స్పేస్‌ను ఉపయోగించుకుని కొంచెం స్పీడప్ చేశాం. ముఖ్యంగా మూడో లవ్‌స్టోరీ మన నేటివిటీకి తగిన విధంగా చాలా మార్పులు చేశాం. మలయాళంలో వుండే ట్విస్టు, తెలుగులో వుండే ట్విస్టు వేరువేరుగా వుంటాయి. ఈ విషయంలో నిర్మాతల సహకారం ఎంతో వుంది.
వచ్చే ఏడే పెళ్లి
సమంతతో నా ప్రేమ వ్యవహారం నా ఫ్రెండ్స్ అందరికీ ముందే తెలుసు. అయితే ఫ్యామిలీలో నాన్నకి మొదట చెప్పాను. ఆయన నాకెప్పుడో తెలుసు ఈ విషయం అన్నారు. ఆయన నా అభిప్రాయాన్ని స్వాగతించారు. ఎంగేజ్‌మెంట్, పెళ్లి వచ్చే ఏడాది జరుగడానికి సన్నాహాలు చేస్తున్నాం. అయితే నా వ్యక్తిగత జీవితాన్ని సింపుల్‌గా సాగిస్తాను కనుక ఎవరితో షేర్ చేసుకోవాలని అనుకోను. నా సినిమా జీవితం అందరికీ షేర్ చేస్తాను. పెళ్లి తరువాత సమంత తన ఇష్టప్రకారం సినిమాల్లో నటిస్తే నటిస్తుంది, లేకపోతే లేదు. దేనికైనా నా సపోర్టు వుంటుంది.
అఖిల్ ప్రేమకథ షాకే
అఖిల్ పెళ్లి విషయం మా కుటుంబంలో ఓ షాక్‌లాంటిదే. నాకు నాన్నకు ఈ రకంగా షాక్ ఇస్తాడని అనుకోలేదు. ఊహించనూ లేదు. తన పెళ్లి విషయంలో అఖిల్ చాలా సంతోషంగా ఉన్నాడు. చిన్న వయసులోనే ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకునేంత ధైర్యం అతనిలో వుండడం హర్షించదగిందే.
సాహసం త్వరలోనే
‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా షూటింగ్ పూర్తయింది. తమిళ వెర్షన్‌కు సంబంధించిన రెండు మూడు షాట్స్ మిగిలి వున్నాయి. ఈ రెండు భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్
కల్యాణకృష్ణ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ జోనర్‌లో ఓ సినిమా వుంటుంది. ఈ చిత్రం సగం గ్రామీణ నేపథ్యంలో, సగం పట్టణ నేపథ్యంలో సాగుతుంది. అయితే ఈ చిత్రానికి ‘నినే్న పెళ్లాడుతా’ అన్న టైటిల్ వినపడుతోంది కానీ, అది కాదు. కాకపోతే ఆ స్టైల్ ఆఫ్ కారెక్టరైజేషన్ వుండడంతో అలా అంటున్నారు.
కమర్షియల్ మూవీనే హైలెట్
క్లాసికల్, లవ్ చిత్రాలు చేస్తున్నాను అనే అనుకుంటారు. ప్రస్తుతం నాకు ప్రేమకథా చిత్రాలే వర్కవుట్ అవుతున్నాయి. యాక్షన్ చిత్రాలు చేద్దామని వున్నా ఇంకా నేను అంత స్థాయికి చేరలేదేమో అనుకుంటా. ఒక రెండు మూడు హిట్స్ వచ్చాక యాక్షన్, కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో నటించడానికి సిద్ధమవుతా అని ముగించారు.

-యు