నిప్పులాంటి నిజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొత్తానికి కరీనాకపూర్ నిప్పులాంటి నిజం చెప్పింది. కథానాయికలు ఇంటర్వ్యూల్లో రకరకాల మాటలు చెబుతుంటారు. ఓ సిన్మాలో కథ నచ్చలేదని, డేట్లు కుదరలేదని సాకులు చెబుతారు. కొంతమంది కాల్షీట్లు అడ్జెస్టుకాక సినిమాలు వదిలేశామని ఏవేవో చెబుతారు. కరీనాకపూర్ మాత్రం ఏ విషయాన్నయినా కుండబద్దలు కొట్టేట్టు చెప్పేస్తుంది. ఈ విషయంలో ఆమె డేర్ డెవిల్ అన్న పేరును సార్థకత చేసుకుంటోంది. తాను నటించడానికి వచ్చానని, తన టాలెంట్‌ను అమ్ముకోడానికి వచ్చాను తప్ప అభిమానులకు ఏది నచ్చితే అది నటించేసి వాళ్ల మనసుల్లో స్థానం సంపాదించుకొని ఆనందించాలని రాలేదని చెబుతోంది. నాగురించి పూర్తిగా తెలిసినవారికి ఈ విషయం బాగా తెలుసని, అలాంటివారితోనే నేను ఎక్కువగా మింగిల్ కావడానికి ప్రయత్నిస్తానని, ఏదైనా సినిమాలో నేను నటించను అని అన్నానంటే, ఆ సినిమాలో ఆ పాత్రకు నేను సరిపోనని అర్థం. అలాంటి నిర్ణయం తీసుకునే అధికారం నాకుంది అని తన మనసులో మాట బోల్డ్‌గా చెప్పేసింది.