ప్రేమ వానవిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతీక్, శ్రావ్య, విశాఖ ప్రధాన తారాగణంగా రాహుల్ ప్రేమ్ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతీక్ ప్రేమ్‌కరణ్ దర్శకత్వంలో లంకా కరుణాకర్‌దాస్ రూపొందిస్తున్న చిత్రం ‘వానవిల్లు’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ఓ అందమైన ప్రేమకథను తీసుకుని అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో కేరళ, మలేసియా, అరకు, హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో విజువల్ వండర్‌లా ఈ చిత్రాన్ని రూపొందించామని, యువతతోపాటు కుటుంబ ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని చూసి ఆనందిస్తారని, ప్రేమికులకు ఓ సందేశాన్ని అందించేలా రూపొందిస్తున్న ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం వానవిల్లులో ఎన్ని రంగులు వుంటాయో అన్ని రంగుల హంగులతో వుంటుందని తెలిపారు. సినిమా కథ సరికొత్తగా వుండడంతో ఈ చిత్రాన్ని తాను రూపొందించామని, త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సన్నాహాలు జరుపుతున్నామని నిర్మాత తెలిపారు.