భావోద్వేగాల జతగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్యామీనన్, దుల్కర్ సల్మాన్ జంటగా ఎస్.కె.పిక్చర్స్ పతాకంపై అన్వర్ రషీద్ దర్శకత్వంలో రూపొందిన ‘జతగా’ చిత్రాన్ని నిర్మాత సురేష్ కొండేటి అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, సెన్సార్‌బోర్డు యు/ఎ సర్ట్ఫికెట్ అందించిందని, మలయాళంలో విజయవంతమైన ‘ఉస్తాద్ హోటల్’ను దర్శకుడు సందేశాత్మక కథనంతో అందమైన ప్రేమకథా చిత్రంగా మలిచారని అన్నారు. పేద, ధనిక వర్గాలమధ్య వుండే అంతరాలను స్పృశిస్తూ సున్నితమైన భావోద్వేగాల సమాహారంగా రూపొందిన ఈ చిత్రం యూత్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వుంటుందని, అన్ని కమర్షియల్ హంగులు ఉన్నాయని, త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు. తిలకన్, సిద్ధిఖి, అసీమ్‌జమాల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:గోపీసుందర్, కెమెరా:ఎస్.లోకనాధన్, రచన:అంజలీ మీనన్, పాటలు:శ్రీమణి, పులగం చిన్నారాయణ, శ్రీవల్లి, మాటలు:సాహితి, నిర్మాత:సురేష్ కొండేటి, దర్శకత్వం:అన్వర్ రషీద్.