నూతన తారలతో ఆరుద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై నూతన తారలు రాజేష్‌కుమార్, పావని, బొడ్డు వెంకి, లావణ్య, భరత్, నిషా ప్రధాన తారాగణంగా ఆనంద సుమన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రానికి ఆరుద్ర అనే పేరును ఖరారు చేశారు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జనవరి మొదటివారంలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాత బొడ్డు బాబురావు మాట్లాడుతూ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో పాత్రలకు అనుగుణంగా నటీనటులను ఎంపిక చేస్తున్నామని, మాటలు హైలెట్‌గా సాగే ఈ చిత్రం లవ్ సెంటిమెంట్ సస్పెన్స్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా అందరికీ నచ్చుతుందని, అన్ని ఎలిమెంట్స్‌తో రూపొందే ఈ చిత్రం విజయం సాధిస్తుందన్న నమ్మకం వుందని తెలిపారు. ఈ చిత్రంకోసం అనేక లొకేషన్లను ఎంపిక చేశామని, ఇప్పటివరకూ ఎవరూ రూపొందించని ప్రాంతాల్లో పాటల చిత్రీకరణ జరుపుతామని, అన్ని హంగులు పూర్తిచేసి, సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఓ వెరైటీ కథతో రూపొందే ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని దర్శకుడు ఆనంద సుమన్ అన్నారు. షకలక శంకర్, జి.ఎం.ఆర్, స్వప్న, సమీర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: భాను, పాటలు: కావూరి శ్రీనివాస్, సంగీతం: శ్రీకోటి, కెమెరా: మహి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శక నిర్మాత: ఆనంద సుమన్.