ఎనిమీ ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది మహేష్ నటించిన ‘శ్రీమంతుడు’ సంచలన విజయం సాధించడంతో ప్రస్తుతం తను నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్ జోరుగా జరుగుతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమా తరువాత మహేష్ నటించే మరో చిత్రానికి అప్పుడే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయట. ప్రముఖ తమిళ దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. ఏప్రిల్ మొదటివారంలో ఈ చిత్రం ప్రారంభం కానున్నదట. ఇప్పటికే దర్శకుడు మురగదాస్ ముంబయిలోని పలు లొకేషన్లను ఓకే చేసినట్టు తెలిసింది. భారతీయ న్యాయవ్యవస్థను బేస్ చేసుకొని రూపొందించే ఈ సినిమాకి ఇదివరకే చట్టంతో పోరాటం అనే టైటిల్ పెడుతున్నట్టు వార్తలొచ్చాయి. ఫైనల్‌గా ఇప్పుడు ఈ సినిమాకి ఎనిమీ అనే టైటిల్‌ను పెడుతున్నట్టు తెలిసింది. త్వరలోనే దీనిపై అధికారికంగా వివరాలు రానున్నాయి. ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు, ఎన్.వి.ప్రసాద్‌లు నిర్మిస్తారట. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది.