త్వరలో ప్రేయసి పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంజలి ‘అందాల ప్రేయసి’గా తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు. డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై రామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఆండ్రియా, రవివసంత్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి పాత్ర హైలెట్‌గా ఉంటుందని నిర్మాత డి.వెంకటేష్ తెలియజేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఓ అందమైన ప్రేమకథతో ప్రేయసిని అందంగా ఎలా ఆరాధించాలి అన్న కథనంతో రూపొందుతున్న ఈ చిత్రంలో స్క్రీన్‌ప్లే హైలెట్‌గా సాగే కథనం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని, రామ్ దర్శకత్వంలో ప్రతి సన్నివేశం సరికొత్తగా రూపొందుతోందని తెలిపారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను త్వరలో విడుదల చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుపుతున్నామని, ఓ మంచి చిత్రాన్ని అందించాలన్న తపనతో రూపొందిస్తున్న ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్ ఉంటాయని ఆయన తెలిపారు.
ఈ చిత్రానికి నిర్మాత: డి.వెంకటేష్, దర్శకత్వం: రామ్.