ఐటెంకు రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జబర్దస్త్‌తో పాపులర్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రేష్మి అటు సినిమాల్లో కూడా నటిస్తూ తనదైన సత్తా చాటుకుంటోంది. ముఖ్యంగా గ్లామర్ పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్న ఈమె, ఇటీవలే ‘గుంటూరు టాకీస్’ చిత్రంలో అందాలను ఆరబోసి షాక్ ఇచ్చింది. ఆ సినిమా తరువాత వరుస అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్న రేష్మికి తాజాగా చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఇంతకీ రేష్మి రేపిన సంచలన కామెంట్స్ ఏంటంటే- ‘జబర్దస్త్ నాకు మంచి లైఫ్ ఇచ్చింది. ఆ లైఫ్‌ను కాదని రాజవౌళి లాంటి దర్శకుడు ఆఫర్ ఇచ్చినా కూడా ఈ ప్రోగ్రామ్‌ను వదిలిరానని’ సంచలన వ్యాఖ్యలు చేసింది. దాంతో రేష్మి కావాలని పొగరుగా మాట్లాడిందని ఫిలిం వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇక ఈ విషయం పక్కనపెడితే ఇటీవలే ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘చారుశీల’ పరాజయం పాలవ్వడంతోపాటు ‘గుంటూర్ టాకీస్’ సీక్వెల్‌లో కూడా నటించడంలేదు. దాంతో డోసు పెంచడానికి సిద్ధమైంది రేష్మి. అందుకే ఇకపై ఐటెం సాంగ్స్ కూడా చేయాలని భావిస్తోందట. ఇప్పటికే తెలుగులో టాప్ హీరోయిన్లు అయిన తమన్నా, శ్రుతిహాసన్, కాజల్ లాంటి వారు ఐటెం సాంగ్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. కాబట్టి తాను కూడా ఈ సాంగ్స్ చేసి క్రేజ్ పెంచుకోవాలని భావిస్తోందట.