బొమ్మల రామారం టీజర్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిషాంత్ దర్శకత్వంలో సూరి, రూపారెడ్డి ప్రధాన తారాగణంగా పుధారి అరుణ రూపొందిస్తున్న చిత్రం ‘బొమ్మల రామారం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి సెన్సార్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన టీజర్‌ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో శుక్రవారం ఉదయం నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేయగా, రాజ్ కందుకూరి పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, ఈ సినిమా టీజర్‌ను చూసి తాను ఈ వేడుకకు వచ్చానని, దర్శకుల ఆలోచనా ధోరణి మారుతోంది అనడానికి ఈ టీజర్ ఉదాహరణగా నిలుస్తుందని, ఈ సినిమా మంచి విజయం సాధించాలని కొత్త సంవత్సరం సందర్భంగా తాను కోరుకుంటున్నానన్నారు. సినిమా టీజర్‌ను చూస్తున్నంతసేపు శ్యామ్‌బెనగల్ సినిమా చూసినట్లు ఉందని, తప్పక విజయం సాధించాలని రాజ్ కందుకూరి కోరుకున్నారు. సినిమా షూటింగ్ పూర్తిచేసి సెన్సార్ కార్యక్రమాలు జరుపుతున్న ఈ చిత్రాన్ని తమ టీమ్ పూర్తి శక్తి సామర్థ్యాలు ఉపయోగించి రూపొందించామని తెలిపారు. ఈ చిత్రం కోసం కష్టపడిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలని నిర్మాత అరుణ అన్నారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొని విశేషాలను తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా:డి.వి.అమర్‌నాధ్‌రెడ్డి, సంగీతం:కార్తీక్ కొడగండ్ల, ఎడిటింగ్:శివ శ్రీనివాస్, నిర్మాత:పుధారి అరుణ, రచన, దర్శకత్వం:నిషాంత్.