తారలు దిగివచ్చిన వేళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై కళకళలాడింది. బాలీవుడ్ తారల ఫ్యాషన్ మెరుపులు ఆహూతులను మైమరిపించాయి. అందాల తారలు, అగ్రహీరోలు అదిరేటి డ్రెస్సులు వేసుకుని క్యాట్‌వాక్ చేసి వాహ్ అన్పించారు. బిగ్ బి అమితాబ్ నుంచి సిద్ధార్థ మల్హోత్రావరకు, ఐశ్వర్యారాయ్ నుంచి అలియాభట్ వరకు అధునాతన దుస్తుల్లో మెరిసిపోయారు. ముంబైలో జరిగిన ఫిల్మ్‌ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ కార్యక్రమం కళ్లు చెదిరేలా అదిరిపోయింది. ఈ కార్యక్రమంలో హైలెట్‌గా నిలిచిన ఐశ్వర్యరాయ్ ప్రఖ్యాత దుస్తుల డిజైనర్ ల బౌలేజాయిసి రూపొందించిన బ్లాక్ అండ్ వైట్ దుస్తుల్లో అదరగొట్టింది. మరో అందాల తార కత్రికాకైఫ్ ఆస్కార్ డిలరెంట రూపొందించిన డ్రెస్‌లో మిలమిల మెరిసింది. బాలీవుడ్‌లో పేరుమోసిన డిజైనర్ ఉల్సానా సెర్జింకో అండ్ స్లాక్‌హెయిర్డో రూపొందించిన ఎర్రని దుస్తుల్లో అందరినీ ఆకట్టుకుంది. అలనాటి అందాల తార రేఖ సంప్రదాయ చీరకట్టు, ఆభరణాలు ధరించి మిగతావారికి భిన్నమైన ఆహార్యంతో ఔరా అన్పించింది. ప్రాచీదేశాయ్, కాజోల్, దిశాపటాని, పూజాహెగ్డే, టైగర్‌ష్రాప్ సహా బాలీవుడ్ ప్రముఖలంతా హాజరయ్యారు.