దీపావళికి కాష్మోరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తీ కథానాయకుడుగా పి.వి.పి. సినిమా పతాకంపై గోకుల్ దర్శకత్వంలో పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అనె్న, ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘కాష్మోరా’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను, ఆడియోను ఇటీవల విడుదల చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి దీపావళి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు గోకుల్ మాట్లాడుతూ దాదాపు రెండున్నర సంవత్సరాల నుండి ఈ సినిమాపై దృష్టిపెట్టామని, ట్రైలర్లకు, ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని, సినిమా అద్భుతంగా వచ్చిందని తెలిపారు. 50 శాతం సినిమా ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంటుందని, ట్రైలర్‌లో చాలా తక్కువగా చూపామని, ‘అరుంధతి’, ‘మగధీర’లా ఈ సినిమా పెద్ద హిట్టవుతుందని నమ్మకం వుందని ఆయన తెలిపారు. దీపావళి కానుకగా మీ ముందుకు వస్తున్న ఈ చిత్రం టైటిలే అందరికీ నచ్చిందని, ఆ రేంజ్‌లోనే ఈ సినిమా హిట్టవుతుందని నిర్మాత పి.వి.పి అన్నారు. ఈ సినిమాను తాను మనస్సుపెట్టి నటించానని, దర్శకుడు ముందుగా ఒక పాత్ర చెప్పారని, ఆ తర్వాత మరో పాత్ర చెప్పాక మూడో పాత్ర గురించి చెప్పారని, అన్ని పాత్రలు తనకు అద్భుతంగా నచ్చాయని, ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుని సినిమా షూటింగ్ చేశామని హీరో కార్తీ అన్నారు. ‘బాహుబలి’ ముందు ఈ సినిమా చిన్నదే అయినా నిర్మాతలు ఎక్కడా వెనుకాడకుండా సెట్స్‌వేసి, అద్భుతంగా తీశారని, నయనతార చేసిన మహారాణి పాత్ర హైలెట్‌గా ఉంటుందని ఆయన అన్నారు.