ఇళయరాజాకు నిషాగాంధీ పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాదిన అనేక చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన ఇసైజ్ఞాని, మేస్ట్రో ఇళయరాజాకు కేరళ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ‘నిషాగాంధి’ పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. వేలాది పాటలకు బాణీలు కట్టి, వందల సంఖ్యలో చిత్రాలకు నేపథ్య సంగీతాన్ని అందించి, లక్షలాదిమంది మనసు రంజింపచేసిన ఆయనకు ఈ అవార్డు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. భారతీయ సినిమాకు ఇళయరాజా చేసిన అద్భుతమైన సేవలకుగాను ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేస్తున్నట్లుగా కేరళ పర్యాటక శాఖా మంత్రి ఎ.పి.అనిల్‌కుమార్ ప్రకటించారు. ఈ నెల 20న జరగనున్న కేరళ కార్యక్రమంలో కేరళ సి.ఎం. ఊమెన్‌చాందీ ఈ పురస్కారాన్ని మేస్ట్రో ఇళయరాజాకు అందజేయనున్నారు. కేరళ విశ్వవిద్యాలయ ఉపకులపతి కె.జయకుమార్, సీనియర్ జర్నలిస్టు గౌరీ దాసన్ నాయర్, కేరళ పర్యాటక శాఖ కార్యదర్శి కమల వర్థనరావు, పర్యాటక శాఖ డైరెక్టర్ షేక్ షరీఫ్‌తోకూడిన బృందం ఈ పురస్కారానికి ఇళయరాజాను ఎంపిక చేయడం విశేషం. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత ఇళయరాజా మాట్లాడుతూ, ఈ అవార్డు సంగీతానికి జరుగుతున్న గౌరవంగా తాను భావిస్తున్నానని, తన సంగీతంతో ఇంతమంది అభిమానులను సంపాదించుకున్నందుకు ఆనందిస్తున్నానని తెలిపారు. ఈనెల 20న కేరళలో జరగనున్న ఈ ఉత్సవానికి తమిళ చిత్ర పరిశ్రమలో పలువురు హాజరుకానున్నారు.