ఏజెంట్ శివ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ జరుగుతోంది. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రానికి కూడా అంతే భారీ హైప్ నెలకొంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌పై సినీ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్స్‌పై రకరకాల రూమర్లు పుట్టుకొస్తున్నాయి. ఈ చిత్రానికి ‘ఎనిమీ’, ‘వాస్కోడిగామా’, ‘అభిమన్యుడు’ వంటి టైటిల్స్ పెడతారంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తల్ని యూనిట్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వుంది. తాజాగా ఈ సినిమాకు మరో టైటిల్ పెడుతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఆ టైటిల్ ఏంటో తెలుసా? ‘ఏజెంట్ శివ’. ఈ టైటిల్‌ని యూనిట్ దాదాపు ఖరారు చేసిందంటూ కోలీవుడ్‌లో వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. అప్పట్లో హీరో కృష్ణ నటించిన ‘ఏజెంట్ గోపి’ ఘన విజయం సాధించడంతో దానిని రిపీట్ చేసే విధంగా టైటిల్ ఉండడంతో ఇదే టైటిల్‌ని పెడతారంటూ మహేష్ అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. మరి దీనికి సంబంధించిన వివరాలు తెలియాలంటే దీపావళి వరకూ ఆగాల్సిందే.