హారర్ సినిమాలో నాగార్జున?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగార్జున హీరోగా చేయని ప్రయోగంలేదు. కమర్షియల్ సినిమా, మాస్-మసాలా, భక్తి ఇలా అన్నిరకాల సినిమాలు చేసి హీరోగా ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇక కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి! ఇప్పటివరకు నాగార్జున కాలుపెట్టనిది ఒక్క హారర్ జోనర్‌లోనే. ఇప్పుడు అందులోను సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రంలో నటిస్తున్న నాగార్జున ఈ సినిమాతో బిజీగా ఉంటూనే ఓ హారర్ సినిమాను నిర్మిస్తున్నాడని తెలిసింది. టి.వి యాంకర్ కమ్ డైరెక్టర్ అయిన ఓంకార్ రూపొందించిన ‘రాజుగారి గది’ సంచలన విజయం సాధించడంతో... దానికి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు ఓంకార్. ఇక ఆ సినిమా నచ్చిన నాగార్జున దాని సీక్వెల్‌ను నిర్మిస్తాడని తెలిసింది. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటీవలే ‘నిర్మల కానె్వంట్’ చిత్రాన్ని నిర్మించిన బ్యానర్స్ అదే.. నాగార్జునతో కలిసి నిమ్మగడ్డ ప్రసాద్ దీనిని నిర్మిస్తారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది.