తాజా షెడ్యూల్‌లో సాయే దైవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్‌చందర్ సాయిబాబాగా నటిస్తున్న తాజా చిత్రం ‘సాయే దైవం’. శ్రీ మల్లాది వెంకటేశ్వర ఫిలింస్, జి.ఎల్.బి. మూవీ మేకర్స్ పతాకాలపై జి.ఎల్.బి.శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ ఈవారంలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఆరాధించే దైవంగా వెలసిన సాయిబాబా ముస్లింలకు ఫకీరు బాబాగా, సామాన్యులకు కల్పతరువుగా నిలిచారని తెలిపారు. సబ్ కా మాలిక్ ఏక్‌హై అంటూ ప్రజలకు శాంతి, కరుణ, దానం, ప్రేమల గురించి బోధించారని, సాయి మహిమలను పలు భక్తులు చెప్పిన అనుభవాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుందని ఆయన అన్నారు. విజయ్‌చందర్ నటించబోయే సన్నివేశాలను ఈ షెడ్యూల్ తెరకెక్కిస్తామని తెలిపారు. 1986లో షిర్డీ సాయిబాబా మహత్మ్యం చిత్రంలో నటించినందుకు నటుడిగా తనకెంతో గుర్తింపు వచ్చిందని, మళ్లీ 30 ఏళ్ళ తరువాత ఆ పాత్రలో నటిస్తుండడం ఆనందాన్ని ఇస్తోందని, దర్శకుడు కథ చెప్పిన తీరు నచ్చడంతో ఈ చిత్రంలో బాబాగా నటిస్తున్నానని నటుడు విజయ్‌చందర్ తెలిపారు. చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, రావు రమేష్, ఎల్.బి.శ్రీరాం, ధన్‌రాజ్, శంకరాభరణం రాజ్యలక్ష్మి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు:బిక్కి కృష్ణ, కెమెరా:పి.సురేందర్‌రెడ్డి, సంగీతం:పోలూరు ఘటికాచలం, కథ, కథనం, దర్శకత్వం:జి.ఎల్.బి.శ్రీనివాస్.