మార్చిలో కాటమరాయుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్ కల్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న ‘కాటమరాయుడు’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి డాలి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత పవన్ తన నెక్స్ట్ సినిమాలు ఓకే చేస్తూ... మరోవైపు జనసేన కార్యక్రమాలను కూడా జోరుగా చేస్తున్నాడు. ఇక ‘కాటమరాయుడు’ సినిమాను శరత్ మరార్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే మెగా అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుకున్న ఈ సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న ఫాన్స్‌కిది నిజంగా గుడ్ న్యూస్.. ఎందుకంటే ఈ సినిమా విడుదల డేట్‌ని ఓకే చేసాడట పవన్! ఇంతకీ ఈ సినిమా విడుదల ఎప్పుడో తెలుసా.. మార్చి 31న విడుదల చేస్తారట. నిజానికి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు కానీ, ఇంకా షూటింగ్ సగం కూడా కాలేదు కాబట్టి.. ఈ సినిమాను మార్చికి పోస్ట్‌పోన్ చేశారు. ఇక ఏప్రిల్‌లో ‘బాహుబలి-2’ విడుదల అవుతుండడంతో ఈ సినిమాను అంతకుముందే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక పవన్‌కల్యాణ్ నెక్స్ట్ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.