రీమేక్‌తోనైనా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఈసారి ఓ మంచి హిట్‌తో ముందుకు రావాలని పట్టుదలతో ఉన్నారు. పలు కథలు వింటున్న ఆయన, ఓ బాలీవుడ్ రీమేక్ సినిమాను తెలుగులో చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమధ్య బాలీవుడ్‌లో వచ్చిన ‘ఏ దివాని హై జవాని’ చిత్రాన్ని రీమేక్ చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా అప్పట్లో బాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అఖిల్‌కు హిట్ దక్కుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. కరణ్ జోహార్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.