రివెంజ్ కామెడీగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ చాముండేశ్వరి దేవి ఫిలింస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అర్జున్ ప్రసాద్ దర్శకత్వంలో ప్రసాద్‌బాబు, మధుబాబు రూపొందిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈనెలలో ప్రారంభం కానుంది. గతంలో ‘ప్రియ నీమీదే ఆశగా’ చిత్రాన్ని రూపొందించిన నిర్మాతలు, కొత్తగా ఈ చిత్రాన్ని రివెంజ్ కామెడీ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నామని తెలిపారు. చైత్ర అనే అమ్మాయిని కథానాయికగా పరిచయం చేస్తున్నామని, కన్నడ మలయాళాల్లో ఆమె కొన్ని చిత్రాల్లో నటించిందని తెలిపారు. మూడు షెడ్యూల్స్‌లో హైదరాబాద్, మంగళూరు, ఉడిపి, కాకినాడ, ఊటీ, వైజాగ్‌లలో చిత్రాన్ని పూర్తిచేస్తామని, ఐదు పాటలు చిత్రంలో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయని వారు తెలిపారు. చంద్రమోహన్, జయప్రకాష్‌రెడ్డి, అలీ, షకలక శంకర్, సప్తగిరి, ఆజాద్, విజయ్ రంగరాజన్, మధు, హేమ, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు:యుగంధర్, సంగీతం:అభిషేక్ రాయ్, కెమెరా:సురేష్, నిర్మాతలు:ప్రసాద్‌బాబు, మధుబాబు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:అర్జున్ ప్రసాద్.