పవర్‌ఫుల్ ధ్రువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా గీతా ఆర్ట్స్ పతాకంపై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ధ్రువ. ఈ చిత్రానికి సంబంధించిన టాకీపార్ట్ పూర్తిచేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. వచ్చేనెల మొదటివారంలో హీరో ఇంట్రడక్షన్ పాట షూటింగ్ జరుపుతామని, ఆ ఒక్క పాట మాత్రమే మిగిలి ఉందని తెలిపారు. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా కనిపిస్తున్నాడని, త్వరలో ఆడియో వేడుక వివరాలు కూడా ప్రకటిస్తామని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు జరుపుతున్నామని, విజదశమికి విడుదల చేసిన టీజర్‌కు మంచి ఆదరణ లభిస్తోందని, చరణ్ చెప్పిన డైలాగ్ ఇండస్ట్రీ టాక్‌గా నిలిచిందని వారు తెలిపారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, విడుదల చేస్తామని తెలిపారు. అరవింద్‌స్వామి విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాజర్, పోసాని కృష్ణమురళి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: పి.ఎస్.వినోద్, సంగీతం: హిప్‌హాప్ తమిళ, ఎడిటింగ్: నవీన్ నూలి, నిర్మాతలు: అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్, దర్శకత్వం: సురేందర్‌రెడ్డి.