రెండు పాత్రల్లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న రవితేజ తాజాగా ‘బెంగాల్ టైగర్’ సినిమాతో మరోసారి అలరించాడు. ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోంది. ఈ సినిమా తరువాత ఆయన వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ఎవడో ఒకడు చిత్రంలో నటిస్తున్నాడు. దీంతోపాటు చక్రి అనే నూతన దర్శకుడి చిత్రానికి ఓకె చెప్పాడు. అలాగే ‘స్వామిరారా’ ఫేం సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయడానికి ఓకె చెప్పాడట. ఇప్పటికే కథా చర్చలు జరిగిన ఈ చిత్రంలో రవితేజ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడట. ఇప్పటివరకూ కమర్షియల్ సినిమాల్లో నటించిన రవితేజ మొదటిసారిగా ప్రయోగం చేయనున్నాడు. ఇందులో 20 ఏళ్ళ కుర్రాడిగా ఓ పాత్రలో కన్పిస్తూ, మరోవైపు 50 ఏళ్ళ వయసు కలిగిన వ్యక్తిగా కూడా కనిపిస్తాడట. ఈ రెండు పాత్రలు విభిన్నంగా సాగుతాయని తెలిసింది. త్వరలోనే సినిమా సెట్స్‌పైకి రానుంది. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడికానున్నాయి.