పిల్ల రాక్షసి వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారా అర్జున్ ప్రధాన పాత్రలో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలింస్ పతాకంపై చదలవాడ పద్మావతి అందిస్తున్న చిత్రం ‘పిల్ల రాక్షసి’. మలయాళంలో విజయవంతమైన ‘ఆన్ మరియ కలిప్పిలాన్’ చిత్రాన్ని తెలుగులో పిల్ల రాక్షసిగా అనువదించారు. మిథున్ మాన్యువల్ థామస్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం అఖండ విజయం సాధించడంతో తెలుగులో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి నవంబర్ 4న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- దర్శకుడు ఓ వైవిధ్యమైన కథనాన్ని తీసుకుని రియలిస్టిక్‌గా రూపొందించిన ఈ చిత్రంలో సరికొత్త స్క్రీన్‌ప్లే వుంటుందని, అదేవిధంగా సంగీతం కూడా ఆకట్టుకుంటుందని తెలిపారు. బిచ్చగాడు వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తరువాత తమ సంస్థ అందిస్తున్న ఈ చిత్రం అంతే స్థాయిలో విజయవంతం అవుతుందని అన్నారు. దుల్కర్ సల్మాన్ ఓ ముఖ్యమైన పాత్రలో నటించిన ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, క్లీన్ యూ సర్ట్ఫికెట్ లభించిందని అన్నారు.