బాయ్‌ఫ్రెండ్స్‌తో హెబ్బా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హెబ్బాపటేల్ కథానాయికగా లక్కీ మీడియా పతాకంపై భాస్కర్ బండి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ రూపొందిస్తున్న చిత్రం ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ పోస్టర్‌ను, ఓ పాటను బుధవారం ఉదయం రేడియో మిర్చిలో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, ఈ సినిమ కథ కోసం దాదాపు సంవత్సరంపాటు ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరిపామని, యూత్‌ఫుల్, లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన కంటెంట్‌పై నమ్మకంతోనే ఉన్నామని తెలిపారు. నిర్మాత రాజు కథ విని కొన్ని మార్పులు చేర్పులు చేయడంతో అలాగే చిత్రీకరించామని అన్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఆడియో, సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో దర్శకుడు భాస్కర్ బండి, అశ్విన్‌బాబు, పార్వతీశం, నోయల్‌సేన్, శేఖర్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. రావు రమేష్, తేజస్వి మడివాడ, పార్వతీశం, కృష్ణ్భగవాన్, సన, తోటపల్లి మధు, ధన్‌రాజ్, షకలక శంకర్, చమ్మక్ చంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ:బి.సాయికృష్ణ, పాటలు:చంద్రబోస్, భాస్కరభట్ల, వరికుప్పల యాదగిరి, స్క్రీన్‌ప్లే మాటలు:డి.ప్రవన్‌కుమార్, ఎడిటింగ్:చోటా కె.ప్రసాద్, సంగీతం:శేఖర్ చంద్ర, కెమెరా:చోటా కె.నాయుడు, నిర్మాత:బెక్కం వేణుగోపాల్, దర్శకత్వం:్భస్కర్ బండి.