రెడీ.. యాక్షన్.. కట్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జబర్దస్త్’ అప్పారావు ప్రధాన పాత్రలో శ్రీ పద్మావతి వెంకటరమణ క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘రెడీ యాక్షన్ కట్’. సిహెచ్.కస్తూరి దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శక నిర్మాత కస్తూరి మాట్లాడుతూ, నూతన సంవత్సరం సందర్భంగా సినిమా పాటలను రికార్డింగ్ చేశామని, సంక్రాంతి పండుగ నుండి షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. పాత, కొత్త నటీనటుల కలయికలో, అప్పారావు ప్రధాన పాత్రలో ఈ చిత్రం ఆద్యంతం వినోదాత్మకంగా రూపొందనుందని ఆమె అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:రాజ్‌కిరణ్, పాటలు: గురుచరణ్, రంగారావు, ఎడిటింగ్: శ్రీనుబాబు, కెమెరా: నాగబాబు, మాటలు: నండూరి వీరేష్, నిర్మాణం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సిహెచ్.కస్తూరి.