బాహుబలితో పోలికే వద్దు - కాష్మోరా హీరో కార్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ హీరోలు తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వడం ఈరోజు కొత్తేమీ కాదు. నాటి కమల్, రజనికాంత్‌లనుండి వారు తెలుగులో కూడా తమ సినిమాలు విడుదల చేస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక ఈమధ్యకాలంలో ప్రతి తమిళ హీరో తెలుగులోకి సినిమా విడుదల చేస్తున్నాడు. అయితే కార్తీ మాత్రం తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు తెలుగు బాగా నేర్చుకుని, తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు చేస్తూ తెలుగు హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ‘ఆవారా’, ‘యుగానికొక్కడు’, ‘ఊపిరి’ వంటి చిత్రాలతో హిట్ అందుకున్న ఆయన తాజాగా నటించిన చిత్రం ‘కాష్మోరా’. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి అక్టోబర్ 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా కార్తీ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లో...

పిరియాడికల్ సినిమా
సినిమాలో మొత్తం రెండు పాత్రలుంటాయి. వాటిలో ఒకటి పిరియాడికల్ పార్‌లో వచ్చే రాజ్‌నాయక్ పాత్ర కాగా, రెండవది ప్రెజెంట్‌లో వచ్చే కాష్మోరా పాత్ర. మొదట కమర్షియల్ యాంగిల్‌లోనే మొదలవుతుంది. ఆ తరువాత ఫ్లాష్‌బ్యాక్‌లో 500 ఏళ్ళు వెనక్కి వెళ్ళాక అక్కడ మరో కథ మొదలవుతుంది. ఇందులో ఒక్క రొమాన్స్ తప్ప, హారర్, కమర్షియల్ ఎలిమెంట్స్, కామెడీ అన్నీ ఉంటాయి. మొత్తం ఫ్యామిలీ వెళ్లి ఎంజాయ్ చేసే సినిమా.
రాజ్‌నాయక్ పాత్ర విశేషం ఏమిటి
రాజ్‌నాయక్ పాత్రకి అన్నింటికంటే ముఖ్యమైనది మేకప్. అందుకే మేకప్‌కు ఎక్కువ టైం పట్టేది. ఇందులో రాజ్‌నాయక్ ఒక సీన్‌లో వేసుకున్న డ్రెస్ మరో సీన్‌లో వేసుకోడు. ప్రతి సీన్‌కి కొత్త కాస్ట్యూమ్ కావాలి. మేకప్‌కి మూడున్నర గంటలు పట్టేది. అంత పర్‌ఫెక్ట్‌గా ఈ పాత్రను డిజైన్ చేశాడు డైరెక్టర్ గోకుల్. రాజ్‌నాయక్ పాత్ర చాలా కాన్ఫిడెంట్‌గా, డిఫరెంట్‌గా ఉంటుంది.
ఫ్లాక్‌బ్యాక్‌లో వచ్చే ఈ సినిమాను బాహుబలితో పోల్చి చూడొద్దు. ఈ సినిమాకు, ఆ సినిమాకు చాలా తేడాలున్నాయి. బాహుబలికి రెండేళ్ల ముందరే ఈ కథ అనుకున్నాం. కానీ బాహుబలి చూశాక సినిమా షూట్ రెండు నెలలు ఆపేసి ఫుల్ హోమ్‌వర్క్ చేసి మాకున్న తక్కువ బడ్జెట్‌లోనే ఆ స్టాండర్డ్స్‌ని అందుకోవడానికి ట్రై చేశాం.
డైరెక్టర్ ఇంతకుముందు రెండు సినిమాలే చేశాడు. కానీ అతను కథ చెప్పిన విధానం నచ్చి నేను ఒప్పుకోవడంతో పాటు మిగతావారిని కూడా ఒప్పించాను. డైరెక్టర్ చాలా ఇంటిలిజెంట్. ప్రతి సన్నివేశం చాలా పర్‌ఫెక్ట్‌గా చేశాడు.
విజువల్ ఎఫెక్ట్స్
ఇందులో 30-45 నిమిషాలపాటు అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బాహుబలి తరువాత ఆ స్థాయిని అందుకోవడానికి ఆ చిత్రంలో పనిచేసిన పనిచేసిన టీమ్‌తోనే విజువల్ ఎఫెక్ట్స్ చేయించాం. అన్నీ చాలా బాగా వచ్చాయి. ఇక నయనతార ఇంతకుముందెప్పుడూ ప్రినె్సస్ తరహా పాత్ర చేయలేదు. దీంతో చెప్పగానే చాలా త్వరగా ఒప్పుకుంది. ఆమె పాత్ర కూడా చాలా బాగుంటుంది.
బెస్ట్ కాంప్లిమెంట్ అది
షూటింగ్ జరిగేటప్పుడు యాక్టర్ వివేక్ నాతో మాట్లాడుతూ.. 30 సినిమాల తరువాత చేయాల్సిన సినిమాని నువ్వు 13 సినిమాలకే చేస్తున్నావయ్యా అన్నారు. అది నాకు చాలా బెస్ట్ కాంప్లిమెంట్. తరువాత 80 ఏళ్ళ వయసున్న మేకప్ ఆర్టిస్టు ఒకరు ఎప్పుడో ఎంజిఆర్ లాంటివారికి ఇలాంటి మేకప్ చేశా, మళ్లీ మీకే చేస్తున్నా అన్నారు. చాలా గర్వంగా అనిపించింది. ఇక సినిమా చేసేటప్పుడు జనాలకు నచ్చుతుందా లేదా అని భయం వేసింది. కానీ గోకుల్ డైరెక్షన్, పివిపి డెడికేషన్ చూశాక ధైర్యమొచ్చింది. చివరికి అవుట్‌పుట్ చూశాక ఖచ్చితంగా జనాలకు నచ్చుతుందన్న నమ్మకం కలిగింది.

- శ్రీ