చిరు సినిమాకు 12 కోట్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఫాన్స్‌లో కూడా భారీ క్రేజ్ నెలకొంది. ఇక మెగాస్టార్ సినిమాలంటే టాలీవుడ్‌లో అదో క్రేజ్. ఆయన సినిమాలకు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి.. బిజినెస్, వసూళ్లు కూడా భారీగానే ఉంటాయి. ఇక ఆయన తాజా సినిమా ‘ఖైదీ నెం.150’కు కూడా భారీ బిజినెస్ ఆఫర్స్ వస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఈ సినిమా శాటిలైట్‌కు కూడా 12 కోట్ల భారీ ఆఫర్ వచ్చిందట. ఓ చానల్ ఈ ఆఫర్‌ని ఇచ్చినట్లు తెలిసింది. ఎనిమిదేళ్ల తరువాత చిరంజీవి సినిమాకు ఇంత భారీ శాటిలైట్ క్రేజ్ రావడం సంచలనం రేపుతోంది. దాంతోపాటు నైజాం హక్కులు కూడా అదే స్థాయిలో భారీగా ఆఫర్ వచ్చిందని తెలిసింది. ఇక మహష్‌బబు, పవన్‌ల సినిమాల సాటిలైట్ హక్కులు 12 నుండి 15 కోట్ల వరకు ఉంటాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమా శాటిలైట్ హక్కులు కూడా ఆ స్థాయిలో పలకడం ఫిలిం వర్గాల్లో సంచలనం రేపుతోంది?