క్రిష్ దర్శకత్వంలో అఖిల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ తన మొదటి సినిమా ‘అఖిల్’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో తన తదుపరి సినిమాపై చాలా శ్రద్ధ తీసుకునే పనిలో పడ్డాడు అఖిల్. మరోవైపు నాగార్జున కూడా అఖిల్‌ను సరైన దారిలో తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ప్రస్తుతం అఖిల్‌తో సినిమా చేసేందుకు దర్శకుడు క్రిష్ సన్నాహాలు చేస్తున్నాడట. విభిన్న కథనాలను తెరపై ఆవిష్కరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న క్రిష్ ఇటీవలే రూపొందించిన ‘కంచె’ చిత్రం మంచి ప్రశంసలు పొందింది. ఈ నేపథ్యంలో క్రిష్ దర్శకత్వంలో అఖిల్‌తో సినిమా చేసేందుకు నాగార్జున సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం కథా చర్చలు జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడి కానున్నాయి.