సవాళ్లను అధిగమించే సింగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ స్టార్ హీరో సూర్య, అనుష్క, శృతిహాసన్ ముఖ్యపాత్ల్రో హరి దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞాన్‌వేల్‌రాజా నిర్మిస్తున్న చిత్రం ‘సింగం-3’. ఈ చిత్రాన్ని తెలుగులో సుర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ అందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ, సింగం సిరీస్‌లోని రెండు చిత్రాలు ఘనవిజయం సాధించడంతో దానికి సీక్వెల్‌గా సింగం-3 రూపొందుతోంది. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. సూర్య, దర్శకుడు హరిల కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ నెలకొంది. సింగం, సింగం-2 సినిమాలకంటే భారీ అంచనాలతో ఈ చిత్రం రూపొందుతోంది. ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులతో సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. నీతి నిజాయితీలే ఊపిరిగా భావించే ఓ పోలీస్ అధికారి వృత్తి నిర్వహణలో తనకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్రం. సూర్య నటన హైలెట్‌గా నిలుస్తుంది. అన్ని రకాల కమర్షియల్ హంగులతో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 7న విడుదల చేసి, అదే నెలలో పాటలను విడుదల చేస్తాం. చిత్రాన్ని డిసెంబర్ 16న విడుదల చేస్తాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:హారీస్ జయరాజ్, సమర్పణ:కె.ఇ.జ్ఞానవేల్‌రాజా, నిర్మాత:మల్కాపురం శివకుమార్, దర్శకత్వం:హరి.