కోలీవుడ్‌లో అందాల రాశి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామ రాశిఖన్నా ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన ప్రేమలో పడేసింది. ఇక ఆ తరువాత గ్లామర్ పాత్రలు చేసి యువ హృదయాలను కొల్లగొట్టింది. ఈమె అందాలకు పడని ప్రేక్షకుడే లేడు. ఇక గ్లామర్ భామ రాశిఖన్నా తెలుగులో స్టార్ హీరోయిన్స్‌కు పోటీగా దూసుకుపోతోంది. ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటిస్తున్న ఈ భామ లేటెస్ట్‌గా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సిద్ధార్థ్ సరసన ‘సైతాన్‌కా బచ్చా’ సినిమాతో అక్కడికి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ గ్లామర్‌కు కోలీవుడ్ ఫ్లాట్ అయింది. బొద్దు బొద్దు అందాలతో హాట్ హాట్‌గా కనిపించే రాశికి ఈ సినిమా ఇంకా విడుదల కాకుండానే వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో గోపీచంద్ సరసన ‘ఆక్సిజన్’ చిత్రంలో నటిస్తోంది. ఇక తమిళంలో ‘ఇమాయక్క నొడిగళ్’ అనే సినిమాలో కూడా నటించేందుకు ఓకే చెప్పింది. దాంతోపాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి. మొత్తానికి రాశిఖన్నా కోలీవుడ్‌లోనే సెటిల్ అయ్యేలా ఉందని అంటున్నాయి సినీ వర్గాలు.