కాటమరాయుడితో ఖైదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలాకాలంగా మెగా ఫామిలీ అభిమానులు ఎదురుచూస్తున్న ఓ అరుదైన సంఘటన హైదరాబాద్‌లో జరిగింది. కొంతకాలంగా అన్నలకు దూరంగా తమ్ముడు పవన్‌కల్యాణ్ ఉంటున్న సంగతి తెలిసిందే. మధ్యలో ఒకటి రెండుసార్లు వారు కలిసి కలివిడిగా మాట్లాడుకున్నా అంతా ఒక్కటే అన్న భావన అభిమానులకు కలిగించలేకపోయారు. ముఖ్యంగా ఏవైనా సినిమా హీరోల వేడుకలలో, కుటుంబానికి సంబంధించిన ఫంక్షన్‌లలో వారు కలిసి కనిపించకపోవడంతో అభిమానులు ఓ కంట కనిపెడుతూనే వున్నారు. అయితే అభిమానులు అనుకుంటున్నట్లుగా అన్నదమ్ములెప్పుడూ విడిపోరు అని ఈరోజు సంఘటన నిరూపిస్తోంది. అర్థంలేని పుకార్లకు ఫుల్‌స్టాప్ పెడుతూ మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఫొటలకు ఫోజులిచ్చారు. విషయంలోకి వెళితే చిరంజీవి కాటమరాయుడు సెట్‌లోకి వచ్చి హల్‌చల్ చేశారు. ఖైదీనెం.150 సినిమాలోని కొన్ని సన్నివేశాలను కాటమరాయుడు సెట్‌లో చిత్రీకరించారు. దీంతో ఒకే సెట్‌లో కలుసుకున్న అన్నదమ్ములు దాదాపు గంటపాటు ఆనందంగా మాట్లాడుకున్నారట. అయితే వారు మాట్లాడుకున్న అంశాలు ఏమిటి అనే విషయం పక్కనపెడితే ఇద్దరూ బ్రదర్స్ ఒకే సెట్‌లో షూటింగ్ చేశారన్న వార్తను మెగా అభిమానులకు పండగైంది.