గోదావరి తీరంలో ప్రేమకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోహన్.ఎస్ హీరోగా పరిచయం అవుతూ రాజారాంమోహన్ దర్శకత్వంలో ఉషామూవీస్ సమర్పణలో బొమ్మనా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘కేరాఫ్ గోదావరి’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా హీరో రోహన్ మాట్లాడుతూ- గోదావరి నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో మంచి ప్రేమకథతోపాటు స్ఫూర్తినిచ్చే అంశాలుంటాయని, షూటింగ్ మొత్తం అమలాపురం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో జరిగిందని, ఈ సినిమాతో తాను హీరోగా పరిచయం అవుతున్నానని చెప్పారు. హైదరాబాద్‌లో పుట్టి న్యూయార్క్‌లో స్కూల్ చదివానని, కాలేజీ చదువులు మాత్రం హైదరాబాద్‌లోనే సాగాయని, చిన్నప్పుడు స్టేజ్ షోలు వేసేవాడినని. దాంతోపాటు అన్నపూర్ణ ఫిలిం స్కూల్లో నటనలో శిక్షణ తీసుకున్నానని, ఈ సినిమా దర్శకుడు రాంమోహన్‌తో వున్న పరిచయంతో అవకాశం వచ్చిందని, రఘు కుంచె అందించిన ఓ సాంగ్ హైలెట్‌గా నిలుస్తుందని, ఈ రోజు ప్రమోషనల్ సాంగ్‌ను విడుదల చేస్తున్నామని, త్వరలోనే పాటలు విడుదల చేసి చిత్రాన్ని ఈనెల చివరిలో విడుదల చేస్తామన్నారు.