అటు కొరటాల.. ఇటు శేఖర్ కమ్ముల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపుగా సగానికిపైగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ కన్‌ఫర్మ్ కాలేదు. ఇక ఈ సినిమా తరువాత మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తాడన్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా కొరటాల సిద్ధం చేశాడని తెలిసింది. డిసెంబర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది. ఇక ఈమధ్యలోకి దూరేందుకు సిద్ధమయ్యాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆమధ్య మహేష్‌తో సినిమా చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. వీరిద్దరిమధ్య చర్చలు కూడా జరిగాయి. ప్రస్తుతం వరుణ్‌తేజ్‌తో ‘ఫిదా’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం దాదాపు పూర్తికావచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మహేష్ కోసం శేఖర్ కమ్ముల స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట. సాఫ్ట్‌కార్నర్‌లో సినిమా తెరకెక్కించే శేఖర్ కమ్ములతో సినిమా చేయడానికి మహేష్ ముందునుండి ఆసక్తిగా వున్నాడు.