ఫిబ్రవరిలో చరణ్ సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారీ అంచనాలతో విడుదలైన ‘బ్రూస్‌లీ’ చిత్రం అనుకున్న స్థాయి విజయం సాధించకపోవడంతో తన తదుపరి సినిమాపై ఎక్కువ దృష్టిపెట్టాడు రామ్‌చరణ్. తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘తనిఒరువన్’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విలన్‌గా అరవింద్‌స్వామి నటిస్తున్నాడు. అయితే, జనవరి 16న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు షెడ్యూల్ మారింది. కొన్ని అనుకోని కారణాలవల్ల ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో ప్రారంభిస్తారట. ఫిబ్రవరి నుండే రెగ్యులర్ షూటింగ్ జరిపి వీలైనంత త్వరగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రామ్‌చరణ్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించే ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్‌లు నిర్మిస్తారట.