నవ్వించే పోకిరిరాజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవా, హన్సికామొత్వానీ జంటగా పి.టి.సెల్వకుమార్ దర్శకత్వంలో రామ్‌ప్రకాష్ రాయప్ప దర్శకత్వంలో పి.ఎస్.పొన్ సెల్వి రూపొందించిన చిత్రం ‘పోకిరిరాజా’. ఈ చిత్రం తమిళంలో విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను తెలుగులో ఎస్.ఎస్.వి.ఎస్. క్రియేషన్స్ పతాకంపై మలిరెడ్డి వీరవెంకట సత్యనారాయణ, ఉసిరికల హనిప్రమోద్, పి.శ్రీనివాస్ సంయుక్తంగా ఈనెల 12న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. జీవా నటన, హన్సిక గ్లామర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని, సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ ఓ కీలకమైన పాత్రలో నటించారని తెలిపారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో రొమాన్స్ హైలెట్‌గా నిలుస్తుందని, ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్‌మెంట్ జోనర్‌లో రూపొందించిన ఈ సినిమా కడుపుబ్బనవ్విస్తుందని వారు తెలిపారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందించిన పోకిరిరాజా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు. రామ్‌దాస్, మనోబాల, మెయిల్ సామి, యోగిబాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమామ్, పాటలు: చల్లా భాగ్యలక్ష్మి, కెమెరా: అంజి, ఎడిటింగ్: వి.జె.సాబుజోసెఫ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్‌ప్రకాష్ రాయప్ప.