7న వస్తున్న వీరప్పన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణా క్రియేషన్స్, జి.ఆర్. పిక్చర్స్, జడ్3 ప్రొడక్షన్స్ పతాకాలపై సందీప్ భరద్వాజ్ కథానాయకుడిగా రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘కిల్లింగ్ వీరప్పన్’. ఈ చిత్రాన్ని జనవరి 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేసినా, సెన్సార్ సర్ట్ఫికెట్ జారీచేయడంలో ఆలస్యం కావడంతో ఈనెల 7న విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు బి.వి.మంజునాధ్, ఇ.శివప్రకాశ్, బి.ఎస్.సుధీంద్ర మాట్లాడుతూ, సెన్సార్ సర్ట్ఫికెట్ జారీ చేసే నేపథ్యంలో కొన్ని సాంకేతిక కారణాలవల్ల సినిమాను వాయిదా వేశామని, అన్ని ఫార్మాలిటీస్ పూర్తిచేసి ఈనెల 7న విడుదల చేస్తున్నామని, కన్నడంలో విడుదలై అశేష ఆదరణ పొందుతోందని తెలిపారు. చాలారోజుల తరువాత రాంగోపాల్‌వర్మ తనదైన స్టైల్‌లో ఈ చిత్రాన్ని రూపొందించినట్లుగా కన్నడ ప్రేక్షకులు అభినందిస్తున్నారని, సందీప్ భరద్వాజ్, శివరాజ్‌కుమార్‌ల నటనను మెచ్చుకుంటున్నారని వారు తెలిపారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్టులు, కెమెరా పనితనానికి మంచి గుర్తింపు వస్తోందని, అందుకు సంతోషంగా ఉందని వారు అన్నారు. యాజ్ఞశెట్టి, పరుల్‌యాదవ్, రాక్‌లైన్ వెంకటేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:రాంగోపాల్ వర్మ.