తెలుగులో శరత్‌కుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సరైనోడు’ ఘనవిజయంతో తెలుగు పరిశ్రమలోని స్టార్ డైరెక్టర్‌లలో ఒకడిగా మారిపోయారు బోయపాటి శ్రీను. హైఓల్టేజ్ యాక్షన్ సబ్జెక్ట్‌తో సినిమాలు చేస్తూ తనతో పనిచేసే హీరోలను మాస్ హీరోలుగా నిలబెట్టే బోయపాటి, తన తరువాతి సినిమాను హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో చేస్తున్నారు. ‘అల్లుడు శీను’ చిత్రంతో కెరీర్ మొదలుపెట్టిన శ్రీనివాస్, ఇప్పటివరకూ సరైన కమర్షియల్ హిట్ అందుకోలేదు. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని బోయపాటికి ఫిక్స్ అయ్యాడు తను. ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకున్న అతని చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ 16నుండి హైదరాబాద్‌లో మొదలుకానుంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రకోసం తమిళ నటుడు శరత్‌కుమార్ నటిస్తున్నారు. ఎన్నాళ్లుగానో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న శరత్‌కుమార్, ఈ చిత్రంలో శ్రీనివాస్ తండ్రిగా నటించనున్నారని, ఈ పాత్ర ఎమోషనల్‌గా సాగుతూ కథకు కీలకంగా వుండనుందని తెలుస్తోంది.