పిచ్చిగా నచ్చావ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమన్నది యూనివర్సల్. కానీ ప్రేమలో వున్న ప్రతి మనిషి తనదైన శైలిలో నిర్వచనం చెబుతుంటారు. అంటే ప్రేమ అన్నది వ్యక్తిగతం కూడా. చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోకుండా నేటి యువత కోసం, ఈర్ష్య, ద్వేషం పెంచుకుపోతున్నారు. దీనివల్ల మనుషులు, మనసులు విడిపోతున్నాయి. అలాంటి అయోమయంలో ఇరుక్కున్న ఓ యువకుడు ప్రేమకు సరైన నిర్వచనం తెలుసుకుని తన వల్ల జరిగిన పొరపాటుని ఎలా సరిదిద్దుకున్నాడు? తన జీవితాన్ని అందంగా ఎలా మలచుకున్నాడు అన్నది తెరపైనే చూడాలంటున్నారు నిర్మాత కమల్‌కుమార్ పెండెం. సంజయ్, చేతన ఉత్తేజ్, నందు, కారుణ్య నటీనటులుగా శ్రీవత్స క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం పిచ్చిగా నచ్చావ్. వి.శశిభూషణ్ దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ- కథ ఏంటనేది రివీల్ కాకుండా ఫస్ట్‌లుక్‌ను ఇంట్రెస్టింగ్‌గా ప్లాన్ చేశామని, సినిమా విజయవంతమై మంచి పేరు రావాలని అన్నారు. చక్కని ప్రేమకథతో రూపొందుతున్న చిత్రమిదని, వల్గారిటీ లేకుండా కుటుంబం మొత్తం చూసేలా ఉంటుందని, 46 రోజుల్లో చిత్రీకరణ పూర్తిచేశామని అన్నారు. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని ఆయన అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ, విందు భోజనం లాంటి చిత్రమిదని, త్వరలో పాటల్ని విడుదల చేస్తామని అన్నారు.