సందీప్ కిషన్ యాక్షన్ థ్రిల్లర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందీప్ కిషన్, మెహరీన్ కౌర్ పీర్జాదా జంటగా సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రం హైదరాబాద్ ఫిలింనగర్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఎ.ఎం.రత్నం క్లాప్‌నిచ్చారు. ఈ సందర్భంగా కథానాయకుడు సందీప్‌కిషన్ మాట్లాడుతూ, చక్రి చిగురుపాటి నిర్మాణంలో రూపొందిస్తున్న ఈ చిత్రం సరికొత్తగా వుంటుందని, సుశీంద్రన్ తెరకెక్కించిన ‘నా పేరు శివ’ చిత్రం నాకు నచ్చిన సినిమా అని, ఆయన ఫ్యాన్‌ను అయిన నేను ఈ సినిమాలో కలిసి పనిచేయడం సంతోషమని తెలిపారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చిత్రంలో కథ, కథనాలతోపాటు అన్నీ కుదిరాయని, మంచి ఔట్‌పుట్ వస్తోందన్న నమ్మకం వుందని దర్శకుడు సుశీంద్రన్ తెలిపారు. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రం భాషకు తగ్గట్టుగా వేర్వేరు చిత్రీకరణతో వుంటుందని అన్నారు. డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి జనవరి, ఫిబ్రవరిలో శరవేగంగా సినిమాను పూర్తిచేసి ఏప్రిల్ లేదా మే నెలలో విడుదల చేస్తామని ఆయన వివరించారు. కార్యక్రమంలో శివలెంక కృష్ణప్రసాద్, కృష్ణ తనయ మంజుల, నీలం కృష్ణారెడ్డి, కథానాయిక మెహరీన్ కౌర్ పీర్జాదా పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు.