బాయ్‌ఫ్రెండ్స్‌తో హెబ్బా పటేల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హెబ్బాపటేల్, తేజస్వి మడివాడ, రావు రమేష్ ప్రధాన తారాగణంగా లక్కీ మీడియా పతాకంపై భాస్కర్ బండి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ రూపొందించిన చిత్రం ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన అందిందని, చిన్న సినిమా టీజర్‌కు యూట్యూబ్‌లో హిట్ రేంజ్‌లో హిట్స్ వస్తాయని ఊహించలేదని, ఇది చాలా ఆనందంగా వుందని అన్నారు. ఈనెల 19న పాటలు విడుదల చేస్తామని, డిసెంబర్ 9న సినిమాను విడుదల చేయనున్నామన్నారు. షూటింగ్ పూర్తిచేసి నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నామని, శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంతో రాజు ఈ సినిమాను విడుదల చేస్తున్నారని ఆయన అన్నారు. కృష్ణ్భగవాన్, సన, తోటపల్లి మధు, ధన్‌రాజ్, షకలక శంకర్, చమ్మక్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:చోటా కె.నాయుడు, సంగీతం:శేఖర్ చంద్ర, ఎడిటింగ్:చోటా కె.ప్రసాద్, మాటలు, స్క్రీన్‌ప్లే:ప్రసన్నకుమార్ బెజవాడ, కథ:బి.సాయికృష్ణ, నిర్మాత:బెక్కం వేణుగోపాల్, దర్శకత్వం:్భస్కర్ బండి.