12న దెయ్యం వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లరి నరేష్ కథానాయకుడిగా జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో శ్రీవేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ రూపొందించిన చిత్రం ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు. యు/ఎ సర్ట్ఫికెట్ లభించింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 12న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులతోపాటు అందరినీ ఆకట్టుకుంటుందని, హారర్ టచ్‌తో అందరినీ నవ్విస్తుందని, నరేష్ కెరీర్‌లో సూపర్‌హిట్ మూవీగా నిలుస్తుందని తెలిపారు. తమ సంస్థకు మరో హిట్ చిత్రంగా నిలుస్తుందని అన్నారు.