విజయ్ కోసం తెలుగు కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ హీరో విజయ్ తన 61వ చిత్రాన్ని అట్లీకుమార్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ తెలుగు కథకుడు విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్నారు. బాహుబలి, భజరంగీ భాయ్‌జాన్, ఈగ వంటి సినిమాలకు కథలను అందించి జాతీయ స్థాయి గుర్తింపు పొందారాయన. అందుకే విజయ్, నిర్మాతలు ప్రత్యేకంగా ఆయన్ని తమ సినిమాకు కథను అందించాలని కోరారు. తాజా సమాచారాన్నిబట్టి విజయేంద్రప్రసాద్ ఇప్పటికే పూర్తి స్థాయి కథను పూర్తిచేసి బౌండెడ్ స్క్రిప్ట్‌ను సినిమా యూనిట్‌కు అందించారట. అలాగే, విజయ్ ప్రస్తుతం భారతం దర్శకత్వంలో భైరవ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక గ్యాప్ తీసుకొని తన 61వ సినిమాను మొదలుపెట్టనున్నాడు.