తరుణ్ లవ్‌స్టోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరుణ్, ఓవియా జంటగా రామ్ ఎంటర్‌టైనర్స్ పతాకంపై రమేష్ గోపి దర్శకత్వంలో ఎస్.వి.ప్రకాష్ నిర్మిస్తున్న చితం ‘ఇదే నా లవ్ స్టోరీ’ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తిచేసుకుంది. చిత్ర విశేషాలను దర్శకుడు తెల్పుతూ.. ‘లే, లడక్, కులుమనాలిలో చిత్రీకరించిన సాంగ్స్ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయని, మూడు పాత్రలలో తరుణ్ నటన అందరిని ఆకట్టుకుంటుందని అన్నారు. లవర్‌బాయ్‌గా తరుణ్‌కి వున్న ఇమేజ్ ఏ మాత్రం తగ్గకుండా పూర్తి స్థాయి లవ్‌స్టోరీని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందించామని, ఎ.ఆర్.రెహమాన్ శిష్యుడు శ్రీనాథ్ విజయ్‌ని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నామని డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న మా చిత్రం ఆడియోని వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.